సాక్షి… వైసీపీ అధినేత జగన్ ఫ్యామిలీకి చెందిన ఓ విషపత్రిక… అబద్ధాల పుట్ట.. ఆ పేపర్‌లో ఒక్క డేట్ తప్ప… మిగిలినవి ఏవీ నిజం కాదనే కామెంట్స్ చేస్తుంటారు ప్రత్యర్ధులు.. ఇటు, ఈ పత్రికలో ప్రచురించిన కథనాలను నమ్మాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగనే అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు.. దీంతో, ఆ పత్రికపై ప్రజలకి ఎలాంటి నమ్మకం ఉందనే విషయం అర్ధం అవుతోంది..
గత 15 ఏళ్లుగా టీడీపీ పార్టీ మీదే అబద్ధపు ప్రచారాలు, కథనాలు వండి వారిస్తోన్న సాక్షి పత్రిక నిజ స్వరూపం…. ప్రజలకు అర్ధం కావడంతో తాజాగా తన రూట్ మార్చింది మేనేజ్‌మెంట్… సెలబ్రిటీల మీద కూడా గాసిప్ కథనాలను ప్రచురిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. క్రెడిబులిటీ తగ్గడంతో వ్యూస్ పడిపోతున్నాయి.. అందుకే, మరోసారి ప్రజలకు రీచ్ కావడానికి అబద్ధపు కథనాలను నమ్ముకోవడం, అమ్ముకోవడం షురూ చేసిందనే ప్రచారం జరుగుతోంది.. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి, నిన్నటితరం హీరోయిన్ ప్రగతిపై సాక్షి వెబ్‌సైట్ పోస్ట్ చేసిన కథనంపై ఆమె మండిపడుతున్నారు.. ఇదెక్కడి సాక్షి పత్రిక… అని ఆమె నిలదీస్తున్నారు.. సాక్షి పత్రిక ఇలాంటి గాసిప్ కథనాలను ఎలా పోస్ట్ చేస్తుందని ప్రశ్నించారు నటి ప్రగతి..
ఇంతకీ మేటర్ ఏంటంటే.. నటి ప్రగతికి గతంలోనే వివాహం అయిదంది.. కొన్నాళ్లుగా ఆమె సింగిల్ గా ఉంటున్నారు.. తాను ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని, మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వివరించారు. అయితే, ప్రగతి రెండో పెళ్లికి సిద్దం అవుతోందని, ఓ స్టార్ నిర్మాతతో ఆమె మ్యారేజ్‌కి సిద్ధం అయిందని వరసగా పలు కథనాలు ప్రచురిస్తోంది సాక్షి పత్రిక. దీనిపై ఆమె సీరియస్ అయ్యారు.. తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని, తాను ఎవరినీ లైన్ లో పెట్టలేదని, ఏ స్టార్ నిర్మాతతోనూ తనకి సంబంధం లేదని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ప్రగతి…
తన వ్యక్తిగత జీవితంపై ఇలాంటి నిందలేయడం సరికాదని, ఓ గాసిప్ వెబ్ సైట్ కంటే దారుణంగా సాక్షి పత్రిక వ్యవహరిస్తోందని నటి ప్రగతి నిప్పులు చెరిగారు.. అయితే, ప్రగతి కామెంట్స్‌పై సాక్షి పత్రిక ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు… మరి, పరువు పోగొట్టుకున్న ఆ పత్రిక ఏం చేస్తుందో చూడాలి..