హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్‌కి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఎవరూ ఊహించని రీతిలో సుమారు లక్షమంది వచ్చారు.. ఒక పార్టీ భారీ బహిరంగ సభకి ఎంతమంది పోటెత్తుతారో…. అంతకుమించి రెస్పాన్స్ దక్కింది.. ఆ సభకు ప్రధాన ఆకర్షణ ఎవరూ లేరు.. అది పార్టీ బహిరంగ సభ కాదు.. ఒక పార్టీ నిర్వహిస్తోన్న కార్యక్రమం కాదు.. ఒక లీడర్ నిర్వహిస్తోన్న సభ అంతకంటే కాదు… సభపై ఎవరు ప్రసంగిస్తారో తెలియదు.. స్టార్ ఎట్రాక్షన్ లేదు.. అయినా ఎంతో డేర్‌గా ఐటీ ప్రొఫెషనల్స్.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం నిర్వహించిన ఈ సభకి భారీ స్పందన లభించింది.. టికెట్ల కోసం ఎగబడ్డారు.. చంద్రబాబు నాయుడు ముందుచూపు, దూరదృష్టితో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తమ జీవితాలు, తమ కుటుంబ ఆర్ధిక, సామాజిక నేపథ్యం మారిపోయిందని భావించడంతో ఈ సభను ఐటీ ప్రొఫెషనల్స్ నిర్వహించారు..
సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభ గ్రాండ్ సక్సెస్ తో టీడీపీలో జోష్ నెలకొంటే, ముఖ్యంగా మూడు పార్టీలలో టెన్షన్ మొదలయింది.. చంద్రబాబుకి కృతజ్ఞతగా ఏపీ, తెలంగాణ యువత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, అది గ్రాండ్‌గా సక్సెస్ కావడంతో జగన్ టీమ్‌లో దడ మొదలయింది.. వైసీపీ ఈ సభని చూసి.. రాబోయే ఎన్నికలలో యువత తమకు దూరం అయిందనే భావనలో ఉంది.. 2019 ఎన్నికలలో జగన్‌కి ఒక్కచాన్స్ ఇద్దామని అండగా నిలిచిన యువత, తాజాగా తమ రాష్ట్రం ఎంతగా వెనకబడిందో, రాజధాని లేకుండా ఏపీని సర్వనాశనం చేశాడనే అంచనాకి వచ్చారు.. అందుకే, చంద్రబాబు లేకపోయినా ఆయన కృతజ్ఞత సభకి ఆ స్థాయిలో యువత క్యూ కట్టారు..
వైసీపీ తర్వాత సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభతో ఉలిక్కిపడిన మరో పార్టీ బీఆర్‌ఎస్.. గత ఎన్నికలలో చంద్రబాబుని ఓడించడానికి జగన్ తో చేతులు కలిపారు కేసీఆర్.. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి దక్కితే, ఆయనతో పోటీ పడడం కష్టం అని, హైదరాబాద్ వెనకబడుతుందని భావించిన కేసీఆర్…. ఆయనని ఓడించడానికి జగన్‌కి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది.. ఇటు, బాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చేది లేదని తెలిపారు.. అందుకే, ఈ సభ ఎఫెక్ట్ త్వరలో జరగబోయే ఎన్నికలపై పడుతుందని లెక్కలు కడుతోంది బీఆర్‌ఎస్.. ఈ ప్రభావంతో తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని భావిస్తున్నారు రాజకీయ పండితులు.. దీంతో, బీఆర్‌ఎస్‌లో కొత్త టెన్షన్ మొదలయింది ఈ సభ సక్సెస్‌తో..
సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభతో టెన్షన్ మొదలయిన మరో పార్టీ బీజేపీ.. చంద్రబాబు అరెస్ట్ వెనక కేంద్ర పెద్దల హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు మొదటినుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది.. దీంతో, హడావిడిగా లోకేష్‌కి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు.. అయినా బీజేపీపై టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానుల ఆవేశం ఏమాత్రం తగ్గలేదు.. తాజాగా జరిగిన చంద్రబాబు కృతజ్ఞత సభతో బీజేపీ షాక్ అయింది.. ఈ ప్రభావం తమపై పడుతుందని ఆందోళనలో ఉంది..
మొత్తమ్మీద, ఒక్క సభతో మూడు పార్టీలలో దడ మొదలయింది.. మరి, దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది..











