బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఇప్పుడు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. చంఢీఘర్లో షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే కరోనా వచ్చినట్టు తెలిసిందట. ప్రస్తుతం కృతిసనన్ బచ్చన్ పాండే అనే సినిమాలో నటిస్తున్నారు. ఆమెకు కోవిడ్ లక్షణాలు ఏమీ కనిపించలేదట అయినప్పటికీ.. టెస్ట్ చేయించుకుంటే.. కరోనా బయటపడింది. డాక్టర్లు చెప్పినట్టుగా మందులు వేసుకున్నాను. కోవిడ్ వచ్చిందనగానే భయపడతారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలి. డాక్టర్లు సూచించినట్లుగా అల్లం వాటర్, ఆవిరి పట్టడం చేశాను. ఇప్పుడు పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డానని చెప్పింది కృతి.
కోవిడ్ కారణంగా సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇలా చేయడం గురించి ఏమంటారు.? అని కృతిసనన్ ను అడిగితే.. కరోనా టైమ్ లో ఏది మన కంట్రోల్ లేకపోవడం వలన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్ లో పాప్ కార్న్, సమోసా తింటూ సినిమాను చూడడం అనేది ఓ అనుభూతి.అయితే.. ఓటీటీలో సినిమా చూడడం వలన రాదు. అయితే.. ఓటీటీ కి అంటూ ఆడియన్స్ ఉన్నారు. నేను కూడా ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేశాను. థియేటర్లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ లెక్కలు వేరుగా ఉంటాయి.
ఓటీటీ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. సినిమా బడ్జెట్ విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏదైనా కంటెంటె ముఖ్యం అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కృతిసనన్ నాల్గవ సీజన్లో ఉన్న హిప్-హాప్ పండుగ అయిన బ్రీజర్ వివిడ్ షఫుల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఇది ప్రతిభను ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పచ్చు. ఇక్కడ వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రొసస్ అంతా ఆన్ లైన్ లో జరుగుతుంది కాబట్టి చాలా ఈజీ అని చెప్పారు.
కృతికి సినిమాల్లో చేరడానికి ముందు నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆమె అద్దం ముందు నిలుచుని మాధురి దీక్షిత్, శ్రీదేవి పాటలకు డ్యాన్స్ చేసేదట. అద్దం ముందు మాత్రమే కాకుండా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేటప్పుడు ఆడిషన్స్ లో మాధురి దీక్షిత్ పాటలకు డ్యాన్స్ చేసేదట. రాజా సినిమాలోని అంకియాన్ చురౌ అనే పాట తనకు బాగా ఇష్టమైన పాట అని చెప్పింది. అలాగే డ్యాన్స్ పోటీల్లోను, బర్త్ డే పార్టీల్లోను డ్యాన్స్ చేయడం అంటే చాలా సరదా అంటూ తన మనసులో మాటలను బయటపెట్టింది కృతిసనన్.










