సినిమా రంగంలో హీరోయిన్ గా వెలిగిన పోయినవారి కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కువ కాలం హీరోయిన్ గా చేసినవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సౌందర్యను చెప్పుకోవాలి. ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె దాదాపు 13 ఏళ్లు నటిగా కొనసాగింది. హెలీకాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించకుండా ఉండి ఉంటే ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగి ఉండేవారనడంలో అతిశయోక్తి లేదు. సినిమా రంగంలో ఎక్స్ పోజింగ్ చేయకుండా రాణించలేరు అనే వాదన ఉంది.
కానీ ఈ మాట సౌందర్యకు వర్తించదు. ఆమె తన పరిధిని మించి ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అన్న సందేహం చాలామందికి కలుగుతుంటుంది. దీనికి సమాధానం నటి ఆమని చెప్పింది. హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా ’ చిత్రంలో ఆమని ఓ కీలకపాత్రను పోషించారు. ఈ సందర్భంగా సౌందర్య సోదరుడి చావుకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా చల్లగా చెప్పారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఆమె సౌందర్య సోదరుడు అమర్ ని పెళ్లాడవలసి ఉండేదట. సౌందర్య తండ్రి సత్యనారాయణ స్వయంగా ఆమనిని ఈ విషయం అడిగారట. దానికి ఆమని నుంచి స్పందన లభించలేదు. దానికి కారణం అప్పటికే అతనికి ఓ లవ్ ఎఫైర్ ఉందని తెలియడమే.
ఆ తర్వాత అమర్ కన్నుమూశారు. ఇక సౌందర్య ఎక్స్ పోజింగ్ కు సంబంధించిన విషయాన్ని కూడా ఆమెని వెల్లడించింది. సౌందర్య హీరోయిన్ గా సినిమా రంగంలో అడుగుపెట్టేనాటికి రోజా, రమ్యకృష్ణ, మీనా అగ్రస్థానంలో ఉన్నారు. పైగా వారు గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెప్పేశారు. అయినా సరే గ్లామర్ పాత్రలను ఒక పరిధి మేరకే సౌందర్య అంగీకరించింది. దీనిపై ఆమని ఓ సందర్భంలో సౌందర్యను అడిగిందట. దానికి సౌందర్య ఇచ్చిన సమాధానం విని ఆమని విస్తుపోవాల్సి వచ్చింది.
తనకు పెళ్లయి భర్త పక్కనే ఉంటే ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలను ఎలా చూడగలం? అని సౌందర్య అందట. అందుకే ఎక్స్ పోజింగ్ కు ఆమె దూరంగా ఉంది. ఆమని చెప్పిన ఈ కబుర్లు మాత్రం చాలా వేడిగానే ఉన్నాయి కదూ. ఇప్పటికే ఎక్స్ పోజింగ్ కాస్తా సెక్స్ పోజింగ్ గా మారిపోయింది. కాల మహిమ మరి. మొత్తానికి ఆమని నోట సౌందర్య సంగతులు కూడా వినాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్యా మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరూ ఉండేది బెంగళూరులోనే కాబట్టి ఆ స్నేహం కూడా మరింత బలపడింది.
Must Read ;- సౌందర్య బయోపిక్ కు వేళాయెరా.. !