ఈ దేశంలోనే పిరికి వ్యక్తి నారా చంద్రబాబునాయుడని, చంద్రబాబును స్టేల బాబు అని కూడా అంటారని, విచారణ ఎదుర్కోలేక, ఆయనకున్న పలుకుబడితో స్టేలు తెచ్చుకోవడంతో ఆయన ఘనుడని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇప్పటి వరకు 30 వరకు స్టేలు తెచ్చుకున్నారన్నారు. ఆయనకు ఉన్న పరపతితోను, కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లను ఆయన కేసులు వాదించటానికి పెట్టుకుంటారన్నారు. సీఐడి కేసులను కొట్టేయాలంటూ ఆయన క్రాష్ పిటిషన్ వేసినా హైకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని నాని అన్నారు. హై కోర్టులో స్టే తెచ్చుకున్నా ప్రజాకోర్టులో ఆయనకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే జడ్పీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని మంత్రి నాని వ్యాఖ్యానించారు.
Must Read ;- కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేష్











