``జిస్మ్ 2” చిత్రం ద్వారా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ అక్కడ పలు చిత్రాలు చేసింది. “వడ కర్రీ” చిత్రంతో తమిళ నాట, మంచు మనోజ్ నటించిన “కరెంట్ తీగ” చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోనికి ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు బాలీవుడ్ సినిమాలు చేస్తూనే దక్షిణాదిలో అవకాశాలు వస్తే అంగీకరిస్తోంది. మరోవైపు మలయాళ పరిశ్రమలోకి “రంగీలా” చిత్రంలో ప్రధాన పాత్ర చేయడం ద్వారా అరంగేట్రం చేసింది. ఇలా ప్రధాన, ముఖ్య పాత్రలు చేయడంతో పాటు ప్రత్యేక పాటలతో హోరెత్తిస్తూ అవధులు దాటిన ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతులు పోగొట్టడమే సన్నీ ప్రత్యేకతగా చెబుతుంటారు.

ఆ మధ్య తెలుగులో డా.రాజశేఖర్ నటించిన “పిఎస్,వి.గరుడవేగ” చిత్రంలో “డియో డియో” అనే ప్రత్యేక పాటలో నర్తించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు బాషలలో రూపొందుతున్న “కోకా కోలా, హెలెన్” చిత్రాలలో ఆమె నటిస్తోంది. ఇక సుదీప్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న “కోతికొబ్బ-3” అనే చిత్రంలో ఓ ప్రత్యేక పాట చేస్తోంది. మొత్తమీద తనదైన ఎక్స్ పోజింగ్ తో ఆమె క్రేజ్ అలానే కొనసాగుతోంది.











