సౌందర్య… తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన పేరిది. ఒక తరంలో నటి సావిత్రి తర్వాత అంతగా జనానికి దగ్గరైన నటి సౌందర్యేనని చెప్పొచ్చు. ఆమె అసలు పేరు సౌమ్య. ఈ తార తెరపై ఇంతగా వెలిగిపోయే విషయం ఆమె తండ్రి సతన్యారాయణకు ముందే తెలుసట. సౌందర్యది బెంగళూరు. ఆమె తండ్రి సత్యనారాయణకు విపరీతమైన జాతకాల పిచ్చి ఉండేదట. చిన్నప్పుడు తెల్లగా కుందనపు బొమ్మలా ఉండే సౌందర్య జాతకాన్ని ఓ జ్యోతిష్కుడు చూసి ఆమె వెండితెరపై నటిగా పెద్ద పేరు సంపాదిస్తుందని చెప్పాడట. ఆ జ్యోతిష్కుడు చెప్పడం వల్లనే ఆమెను సినిమాల్లో నటించడానికి ఆయన అంగీకరించాడు. చాలా మంది నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. నిజానికి సౌందర్య మాత్రం యాక్టర్ కాకపోతే కచ్చితంగా డాక్టర్ అయ్యుండేది. ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివేటప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆమె తండ్రి స్నేహితుడి నుంచే సౌందర్యకు మొదటి సినిమా అవకాశం వచ్చింది. అది ‘గంధర్వ’అనే సినిమా. అలా మొదలైన ఆమె నట జీవితం 100 సినిమాలకు పైబడి సాగింది. ఆమె బతికి ఉంటే రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగి ఉండేదేమో: సౌందర్య తెరపై వెలిగిపోతుందని చెప్పిన జ్యోతిష్కుడు ఆమె ప్రమాదంలో మరణిస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడో సత్యనారాయణకు అర్థం కాని విషయం. ఆమె మరణించి మొన్న ఏప్రిల్ కు 16 ఏళ్లు నిండాయి. ఆ సౌందర్యపు మెరుపులను తెలుగు జనం ఇప్పటికీ మరువలేకపోతున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ‘తప్పుచేసి చూడు’ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె విమాన ప్రమాదంలో మరణించింది.
భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన "మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ "...