టాలీవుడ్ లో ఓ ఒకప్పుడు అగ్ర తారలతో పాటు యంగ్ హీరోల సరసన మెరిసిన అందాల కథానాయిక మీనా. ఆమె ప్రత్యేకత ఏంటంటే.. తనతో పాటు అప్పట్లో సందడి చేసిన దాదాపు అందరు హీరోయిన్స్ .. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లిగానూ, అత్తగానూ మెరిశారు. కానీ ఆమె మాత్రం ఇప్పటికీ అగ్ర హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే ఉంది. లేటెస్ట్ గా మోహన్ లాల్ జోడీగా దృశ్యం 2 లో అద్భుతంగా నటించి.. మళ్ళీ వార్తల్లో నిలిచిన మీనా.. ఆ క్రెడిట్ తోనే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయికగా మీనాను ఎంపిక చేశారట. వీరిద్దరి కాంబో లో ఆఖరుగా వచ్చిన సినిమా అల్లరి మొగుడు. అయితే .. ఆ తర్వాత మళ్లీ ఈ జంట ‘మామ మంచు అల్లుడు కంచు’ లో జోడీగా నటించారు. ఇప్పుడు మరో సారి సన్నాఫ్ ఇండియా చిత్రంతో సందడి చేయనుండడం విశేషంగా మారింది. లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నారు. మరి మోహన్ బాబు, మీనా జంటకి మళ్లీ ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Must Read ;- మోహన్ బాబుకే కాదు సినీ జనాలకూ షాకే