తెలుగుతో పాటు తమిళంలోనూ సమ ప్రాధాన్యంతో సినిమాలు చేస్తూ వచ్చిన త్రిషకు చాలా కాలంగా తెలుగులో సినిమాలే లేకుండాపోయాయి. `లయన్’, `నాయకి’ చిత్రాల తర్వాత ఆమె చేతిలో డైరెక్ట్ తెలుగు చిత్రాలేవీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎంతసేపు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమవుతున్నవే.. ఆ రకంగా ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం కలుగుతోంది. అయితే తమిళంలో మాత్రం ఆమె హవా ఎంతమాత్రం తగ్గలేదు. దాదాపు అరడజను చిత్రాలకు పైగా త్రిష చేతిలో ఉన్నాయంటే ఆమె క్రేజ్ అక్కడ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఆ మధ్య విడుదలైన ‘96, పేట్ట’ సినిమాలు విజయం సాధించడం కూడా త్రిషకు కలిసొచ్చింది.
ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏడు సినిమాలలో ఆరు తమిళం కాగా ఒక మలయాళ చిత్రం కూడా ఉంది. తమిళంలోని ఆరు చిత్రాలలో రెండు ప్రధాన పాత్ర చిత్రాలతో పాటు అరవింద స్వామి సరసన శతురంగ వెట్టై 2, ఇంకా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటిస్తున్న `పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇదిలావుండగా…వీటికి అదనంగా ఇంకో కొత్త అవకాశం ఆమెను వెతుక్కుంటూ ఓ విశేషం. దాదాపు ఐదేళ్ల క్రితం విజయం సాధించిన బాలీవుడ్ హిట్ చిత్రం `పికు’ ను తమిళంలో రీమేక్ చేసేందుకు. సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ లో ప్రధాన పాత్రలో నటించేందుకు త్రిషతో సంప్రదింపులు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబందించిన వివరాలు తెలుస్తాయని అంటున్నారు.
Must Read ;- బాలీవుడ్ లోకి ‘మిథునం’ .. జంటగా స్టార్ కపుల్ ?











