మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు కల్పిస్తున్న రక్షణ పై దస్తగిరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సీబీఐ అధికారుల సిఫారసు మేరకు కోర్టు తనకు పోలీసు సెక్యూరిటీ కల్పించమని ఆదేశించినా,ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. తన ఇంటివద్ద ఎవరూ కాపలా ఉండడం లేదని.. దీని వెనుక ఆంతర్య ఏమిటో అర్ధం ఆవడం లేదని అన్నారు.
ఈ మేరకు దస్తగిరి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన దస్తగిరి.. “నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వడం లేదు. నా సెక్యూరిటీ కోసం లోకల్ పోలీసులను ఇచ్చారు. ఆ లోకల్ పోలీసులు కూడా వారికి నచ్చినప్పుడు వచ్చి వెళుతున్నారని తెలిపారు. ఏమైనా అడిగితే మేము మా పరిధిని దాటి రాలేమని, ఏదైనా ఇబ్బంది ఉంటే సీబీఐ ఎస్పీకి చెప్పుకోమని సలహా ఇస్తున్నారని, ఇటువంటి చిన్నపాటి విషయాన్ని కూడా తాను సిబిఐ ఎస్పీ స్థాయి వ్యక్తి దృష్టికి ఏ విధంగా తెసుకెళ్లగలనని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు.అదేసమయంలో తనకు ఎక్కడ సెక్యూరిటీ ఇచ్చారో చెప్పాలని.. తనకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?” అంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు.