ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య .. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే వెరైటీ మూవీ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో చై.. హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. గత ఏడాది ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే. అందులో నాగచైతన్య హాకీ స్టిక్ పట్టుకొని రివీలయ్యాడు. దాంతోనే ఆ విషయం కన్ఫర్మ్ అయింది. ఇంతకు ముందు చైతూ ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘థాంక్యూ’ సినిమాకి సంబంధించిన ఒక లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
థాంక్యూ సినిమాలో నాగచైతన్య మహేశ్ బాబు ఫ్యాన్ గా నటిస్తున్నాడని ఇదివరకే వార్తలొచ్చాయి. దానికి బలం చూకూర్చుతూ.. ఈ వీడియోలో హీరో చైతన్య.. మహేశ్ బాబు ఒక్కడు సినిమాకి సంబంధించిన నిలువెత్తు కటౌట్ మీద నిలబడి..జయ జయ ధ్వానాలు పలకడం అందరినీ ఆకట్టుకుంటోంది. అంత పెద్ద కటౌట్ పైకి చైతూ.. రోప్స్ సహాయం తో ఎక్కడం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దీన్ని బట్టి.. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో ఎవరో షూట్ చేసి వీడియ్ ను పోస్ట్ చేశారని అర్ధమవుతోంది. ఏదేమైనప్పటికీ.. థాంక్యూలో నాగచైతన్య .. తమ అభిమాన హీరో ఫ్యాన్ గా నటించడం మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. మరి థాంక్యూ మూవీ చైతూకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్కినేని హీరో
Get Ready Super fans to see Never before Ever After type Reference in #ThankYouTheMovie 🔥 pic.twitter.com/eHMX8RB89Q
— Jack Mowa Ka Baab 😎 (@FanForSSMB) March 8, 2021