యువ సమ్రాట్ నాగచైతన్య మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో పటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అనౌన్సెమెంట్ వచ్చిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్ వినిపించింది.. కానీ ఆమె ఎంపికకాలేదు.
ఇక ఇందులో కథ ప్రకారం మెయిన్ హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఈ ఇద్దరి హీరోయిన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. అయితే.. ఆ ఇద్దరూ.. క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, రష్మిక అని సమాచారం. ఈ ఇద్దరికి ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఆ ఇద్దరినీ నటింపచేస్తే.. ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం.
అందుకే దిల్ రాజు ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ ని ఈ సినిమాలో నటింపచేసేందుకు ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ డేట్స్ ప్రాబ్లమ్ వలన ఇద్దరు ఇందులో నటించడం కుదరకపోతే.. కనీసం ఒక్కర్నైనా ఈ సినిమాలోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. మరి.. ఈ క్రేజీ హీరోయిన్స్ ఇద్దరూ ఇందులో నటిస్తారా..? లేక ఒక్కరే నటిస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- గోవాలో చైతూతో సామ్ రొమాంటిక్ జూమ్











