హీరోలు అభిమానులకు ఆరాధ్య దైవాలు. వారి కోసం దేనికైనా తెగించే వారుంటారు. ఒకోసారి హద్దులు దాటిన అభిమానం వల్ల అనర్ధాలు జరిగి వారి ప్రాణాలు పోయిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఓ షాకింగ్ సంఘటన నాగచైతన్య కళ్ళ ముందే జరిగింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చైతూ నటిస్తోన్న థాంక్యూ మూవీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఒక నదిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఒక సన్నివేశంలో భాగంగా… నాగచైతన్య ఒక బోటును నడుపుకుంటూ వస్తూండడాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అతడ్ని చూడడానికి జనం గుమిగూడారు.
ఇంతలో బ్రిడ్జ్ మీద ఉన్న ఒక ఆకతాయి అభిమాని.. చైతూ బోటు ముందు నదిలో అమాంతంగా దూకేశాడు. దాంతో కంగారు పడ్డ యూనిట్ వెంటనే స్పందించి అతడ్ని నదిలోంచి బైటికి తీసుకొచ్చారు.. కొంత సమయం అతడితో మాట్లాడి.. సున్నితంగా మందలించి.. అతడితో సెల్ఫీ దిగి పంపించాడు చైతూ. దీని వల్ల కొంత సమయం షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. ఈ సంఘటనలో ఆ అభిమానికి జరగరానిది కానీ జరిగి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఏమోకానీ.. చైతన్యకి ఇది తన జీవితంలో మరిచిపోలేని సంఘటనే అని చెప్పుకోవాలి.
Must Read ;- చైతూ, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’పాట ఇలా..
https://twitter.com/Aaryaprasad/status/1366723056211664898











