నానీ ‘గ్యాంగ్ లీడర్’ రిజల్ట్ ఏమైనప్పటికీ.. అందులో కథానాయికగా క్యూట్ గా నటించిన అమ్మాయి ప్రియాంకా అరుళ్ మోహన్ అందరికీ భలేగా గుర్తుండిపోతుంది. లేలేత సొగుసులతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఈ సినిమా లోని ఆమె అందం , అభినయం ఆమెకు శర్వానంద్ తో శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ తెచ్చిపెట్టింది. ఇందులో కూడా ఆమె అందం, అభినయం, క్యూట్ నెస్ ప్రేక్షకుల్ని బాగానే అలరించనున్నాయని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది. ఆ సినిమా ఇంకా విడుదలవకుండానే ఆమె మరో సూపర్ ఆఫర్ ను అందుకుంది.
ఈ సారి ప్రియాంకా ఎవరి సరసన నటించబోతోందో తెలిస్తే ఆశ్చర్యమనిపించక మానదు. ఇంకెవరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అతడి సరసన కథానాయికగా నటించే అరుదైన అవకాశం అమ్మడిని వరించింది. ప్రస్తుతం పరశురామ్ తో ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తోన్న మహేశ్.. ఈ సినిమా కంప్లీట్ కాగానే మరోసారి అనిల్ రావిపూడితో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో అతడి సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఎంపికచేశాడట దర్శకుడు అనిల్. దాదాపుగా ఆమె నే కథానాయికగా ఖాయం చేయొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంకా తమిళ మూవీస్ లో కూడా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. మరి ఈ సినిమా ఆమెకు ఏ రేంజ్ లో అవకాశాల్ని అందిస్తుందో చూడాలి.
Must Read ;- వచ్చే సంక్రాంతికి మహేశ్ – పవన్ వార్