బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ల్లో ఒకరు ఆలియా భట్. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు ఆలియా తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ కాగా.. రెండోది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించనున్న మూవీలో నటిస్తోంది.
అయితే.. ఈ రెండు సినిమాల కంటే ముందుగా గంగూభాయ్ కథియావాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆలియా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఇంతకీ ఆలియా ఏం చెప్పిందంటే.. సంజయ్ సర్ గంగూభాయ్ కథ చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేనీ పాత్ర చేయగలనా అని.. సార్ ని అడిగాను. నువ్వే చేయగలవని అన్నారు ఆయన.
సంజయ్ సార్ ని నమ్మి ఒప్పుకున్నాను. సంజయ్ సర్ చెప్పింది ఫాలో అయ్యాను. సినిమాలో కొంత పార్ట్ కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది. డైట్ ఫాలో అవ్వకుండా ఏది తినాలనిపిస్తే.. అది తినేయమని సంజయ్ సర్ చెప్పారు. అలాగే చేశాను అని చెప్పింది. ఇక తన డ్రీమ్ గురించి చెబుతూ.. ఆల్ ఇండియా యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. శ్రీదేవి గారు నాకు స్ఫూర్తి. ఆమె అన్ని భాషలోనూ సూపర్ స్టార్ అయ్యారు. నేనూ అలా అవ్వాలనేదే నా కోరిక అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది ఆలియా.











