యూనివర్శల్ హీరో కమల్ హాసన్ కూతురిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతిహాసన్. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సక్సస్ రావడానికి కాస్త టైమ్ పట్టింది. గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ సరసన నటించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కెరీర్ లో కాస్త గ్యాప్ వచ్చింది.
ఇక ఇటీవలే క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. అలాగే వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతిహాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2016లొ నాగ చైతన్యతో కలిసి నటించి ప్రేమమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాలో నేను చేసిన మలర్ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను బాగా ట్రోల్ చేశారు.
ఆ సమయంలో ఈ సినిమా ఎందుకు చేశానా అని చాలా బాధపడ్డాను. అసలు ఆ.. సినిమాలో నటించకుండా ఉండాల్సింది అనిపించింది. ఒకానొక సమయంలో బాగా ఫీల్ అయ్యాను. అయితే.. ఇది కొంతసేపే. ట్రోల్స్ గురించి పక్కన పెడితే.. ఆ సినిమాలో మలర్ పాత్ర చేస్తున్నప్పుడు ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను. తెలుగులో నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే విజయాన్ని అందించింది అని చెప్పింది శృతిహాసన్.











