ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం ఎదురైంది. కరోనాతో కవిత కుమారుడు సంజయ్ రూప్ ఇటీవల మరణించాడు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న సంజయ్ రూప్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సంజయ్ రూప్ తుది శ్వాస విడిచాడు. దీనితో కవిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో విషాదం. ఆమె భర్త దశరధరాజ్ కి కూడా కరోనా సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ఆయన కరోనా నుంచి బయటపడతారు అనుకుంటే.. ఆయన కూడా కరోనాకి బలైయ్యారు. కరోనాతో గత కొన్ని రోజులుగా పోరాడిన కవిత భర్త కూడా మరణించారని సమాచారం. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా తుదిశ్వాస విడిచారు. ఇలా ఒకే నెలలో కుమారుడిని.. భర్తని కోల్పోయిన కవిత తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇది కవితకు కోలుకోలేని విధంగా పెద్ద షాక్. చాలా తక్కువ రోజుల గ్యాప్ లోనే కొడుకును, భర్తను కోల్పోవడం బాధాకరం. ఈ విషయం తెలసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- జనాలను వెంటాడుతున్న కరోనా మహామ్మారి











