స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఆ మధ్య ఎప్పుడో మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి బన్నీ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు దర్శకుడు సుకుమార్. అయితే కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా ఇప్పటి వరకూ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనేలేదు. ఈమధ్యనే సినిమా షూటింగ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అనేక సినిమా తాలూకా షూటింగ్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు ‘పుష్ప’ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు.
అయితే ఈ సినిమా పై తాజాగా సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 6 నుంచి మొదలు పెట్టనున్నారట. వచ్చే నెల 6వ తేదీన షూటింగ్ లో బన్నీ పాల్గొంటాడని సమాచారం. బన్నీ సరిగ్గా నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తాడని చిత్ర బృందం తెలిపింది. అందుకోసం కూడా బన్నీ ఇప్పటికే అన్ని రకాలుగా సన్నద్ధం అవుతున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.’ పుష్ప’ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అసలే బన్నీ, సుకుమార్, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం అందులోను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చెయ్యడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బన్నీకి ఈ సినిమా కూడా పక్కా హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. బన్నీ కూడా ఈ సినిమాపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. తన స్టైల్ ను పక్కన పెట్టి పక్కా మాస్ గెటప్ లో కనపడనున్నాడు బన్నీ. అందాల రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ‘పుష్ప’ సినిమా తో బన్నీ తన అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.