ఎంతో సింపుల్ గా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాల జోలికి అస్సలు పోరు. ఆయన ఆన్ స్క్రీన్ లో ఎంత హుందాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే హుందాగా ఉంటారు. ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందుండే మహేష్ బాబు ఆమధ్య కాలంలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాలను దత్తతు తీసుకోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడు.
అంతే కాకుండా మహేష్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వల్ల ఇప్పటివరకు 150 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టగ్రమ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసినందుకు ఎంతో గర్వంగా ఉందిని కూడా ఆమె తెలిపింది.
ఇప్పుడు తాజాగా మహేష్ వల్ల మరో చిన్నారి ప్రాణం ఊపిరిపోసుకుంది. తనుశ్రీ అనే చిన్నారికి హృదయ నాళంకు సంబంధించి ఆపరేషన్ చేయించడం ద్వారా మహేష్ బాబు మరో ప్రాణాన్ని కాపాడినట్టయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టగ్రమ్ వేదికగా తెలిపింది. చాలా ఆనందంగా ఉందని ఇలాంటి మంచి పనులు మహేష్ ఇంకా చాలానే చేస్తారని ఆమె తేలింది.
తమ అభిమాన నటుడు మహేష్ బాబు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మా అభిమాన నటుడి అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తామని, వీలైనంత సహాయం మేము కూడా చేస్తామని వారు వాపోయారు. ఏదిఏమైనా మహేష్ ఇటువంటి మంచి పనులు చేయడం సినీ ప్రముఖులను సైతం కదిలించింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.