విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు 22 వేల ఎకరాలు అప్పగించిన వారి త్యాగం చిరస్మరనీయమని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి విడిపోయి.. రిక్తహస్తాలలో ఉన్న రాష్ట్రానికి.. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు తమ వంతుగా త్యాగం చేసి.. నేడు ప్రభుత్వ 3 రాజధానుల నిర్ణయంతో ఉద్యమ బాటపట్టిన అమరావతి రైతులు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
గతంలో తమలాగే విశాఖ రైతులు త్యాగఫలితానికి గుర్తు విశాఖ ఉక్కు పరిశ్రమగా వారు అభివర్ణించారు. అలాంటి తెలుగువారి పోరాటపటిమకు చిహ్నంగా నిలిచిన విశాఖ ఉక్కు నేడు ప్రైవేట్ వారి పరం కావడం బాధాకరమని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. కార్మిక సంఘాల పోరు పూర్తి న్యాయబద్దమైనదని.. వారికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ప్రకటించారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఉద్యోగులకు ఎసరు: ఉండవల్లి











