కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.1984 ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన అనూప్ చంద్ర పాండే యూపీ సీఎస్‌గా పనిచేసి 2019లో రిటైర్ అయ్యారు.సీఈసీగా ఉన్న సునీల్ అరోరా ఏప్రిల్ 12 రిటైర్ కావడంతో ముగ్గురు సభ్యులున్న ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ ఏర్పడింది.దీంతో ఆ స్థానంలో పాండేను నియమించారు.2024 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర , కమిషనర్‌గా రాజీవ్ కుమార్ ఉన్నారు.
Must Read ;- షర్మిల పార్టీ YSRTP.. కాని ఎన్నో సందేహాలు