ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు విశాఖలు కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాయి. ఇక రాజధాని అమరావతి ఎఫెక్ట్‌తో విజయవాడలోనూ ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున పెరిగాయి. విశాఖపట్నం, విజయవాడ ఏపీలో ఉపాధి కేంద్రాలుగా మారాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్..ఫస్ట్ టైం సిటీస్ ఆన్ ది రైజ్-2025 పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియాలో ఉద్యోగాల మార్కెట్ పరంగా వృద్ధి, వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్- 10 నగరాల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో విశాఖపట్నం నెంబర్-1 స్థానంలో ఉండగా..విజయవాడ నెంబర్ – 3 స్థానంలో ఉన్నాయి. టాప్ – 3 నాన్ మెట్రో కేంద్రాలుగా నిలిచాయి. సిటీస్ ఆన్ ది రైజ్ అనేది లింక్డ్ఇన్ యొక్క మొట్టమొదటి లొకేషన్-ఆధారిత ర్యాంకింగ్, ఇది భారతదేశం అంతటా నియామకం, ఉద్యోగ సృష్టి, ప్రతిభలలో వృద్ధిని ఒడిసిపట్టే ప్రత్యేకమైన లింక్డ్ఇన్ డేటా ఆధారంగా రూపొందించబడిం
విశాఖపట్నం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, విద్య, లాజిస్టిక్స్, మెటల్ మినరల్స్ వంటి రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం, తక్కువ జీవన ఖర్చు, ఈ నగరాన్ని ఉద్యోగ కేంద్రంగా మారుస్తున్నాయి.
విజయవాడలోనూ ఐటీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగాలు ప్రధానంగా పెరుగుతున్నాయి. HCLTech, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలు విజయవాడలో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అమరాతి ప్రభావంతో విజయవాడలో వివిద రకాల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. లింక్డ్‌ఇన్ నివేదికలో విశాఖపట్నం, రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, ఆగ్రా, మదురై, వడోదర, జోధ్‌పూర్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.











