ఇటీవల నెల్లూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరిస్తోంది.. ఆయన చేసిన కామెంట్స్ వేరు, వాటికి వైసీపీ నేతలు తీస్తున్న అర్ధాలు వేరని గుర్తు చేశారు చంద్రబాబు.. దీనిపై మరోసారి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ఆగవని, అన్నీ సకాలంలో అందుతాయని, వాటిని ఆపమని హామీ ఇచ్చారు..
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఫేక్ ప్రచారం చేసింది. వైసీపీకి ఓట్లు వేసిన వారికి చంద్రబాబు సర్కార్ పథకాలు ఇవ్వను అన్నారని, ఇది అన్యాయం అని, బాబు ప్రభుత్వంలో ఇలాంటివి కామన్ అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. సాక్షి చానెల్ నెగిటివ్ స్టోరీలు అల్లేసింది.. బోలెడు కథనాలు ప్రచురించింది వైసీపీ కరపత్రిక, జగన్ – భారతి విషపుత్రిక సాక్షి పేపర్.. తాజాగా ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు.. తన వ్యాఖ్యలని వైసీపీ వక్రీకరించిందని, అది ఒక ఫేక్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి..
టీడీపీ నేతలు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకోకూడదని తాను వ్యాఖ్యానిస్తే ఫేక్ పార్టీ నేతలు నెగిటివ్ ప్రచారం చేశారని వివరించారు చంద్రబాబు.. వైసీపీకి ఓటు వేస్తే, తాను పథకాలు ఇవ్వనని ఆ పార్టీ నేతలు తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని, తన సర్కార్‌లో అలాంటి వివక్ష పాటించమని, అర్హులయిన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి.. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని టీడీపీ నేతలు, వైసీపీ నేతలకి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు చంద్రబాబు..
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చారు.. అభివృద్ధి, సంక్షేమం.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. సూపర్ సిక్స్ కోసం భారీగా నిధులు కేటాయించారు ఏపీ ముఖ్యమంత్రి.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్ స్కీములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. వీటితోపాటు రాష్ట్ర జీడీపీని పెంచుకునేందుకు, ఆదాయం డబుల్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.. ఇటు వందల కంపెనీలని ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు చంద్రబాబు.. ఈ చర్యలు విజయవంతం అయితే, దేశంలోనే అగ్ర స్థానానికి ఏపీ పరుగులు పెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్ధిక వేత్తలు..