ఏపీ ప్రజలకు సినిమా పండగ వచ్చేసింది. మరో పది రోజుల్లో థియేటర్లలో ఎంచక్కా సినిమాలు చూసేయొచ్చు. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆన్ లాక్ 5.0 నియమనిబంధనలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఏపీ లో థియేటర్లను ప్రారంభించేందుకు అనుమతి వచ్చేసింది. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్ పార్కులు, క్రీడాకారుల ప్రాక్టీసు చేసుకోడానికి, స్విమ్మింగ్ ఫూల్స్ కి ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు.
విద్యార్థుల పాఠశాల విషయంలో ఇంకా కొంత స్పష్టత రావలసి ఉంది. ప్రభుత్వం ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు ఓకే అంటే తప్ప పాఠశాలలు ప్రారంభించడానికి లేదు. దీన్ని బట్టి ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ తాజా నిర్ణయం సినీ జనులకు ఊరటనిచ్చే అంశం. ఆరు నెలల తర్వాత ఏపీలో మళ్లీ థియేటర్లు ప్రారంభమవుతాయి.
అటు కేంద్రం నుంచి ఇప్పటికే థియేటర్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం 50 శాతం సీటుంగుతోనే ఈ థియేటర్లు ఉంటాయి. తెలంగాణలో థియేటర్లు ప్రారంభం కాకుండా ఏపీలో మాత్రమే థియేటర్లు ప్రారంభించడం కుదరని అంశం. ఈ విషయంలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావాలి.