టాలీవుడ్ లో ఇప్పుడు అందరి హీరోలకూ సాయిపల్లవి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కేవలం పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గానే అమ్మడు మూవ్ అవుతున్నా.. స్టార్ హీరోలు సైతం ఆమే కావాలంటున్నారు. ఆమె నుంచి గ్లామర్ రోల్స్ ఆశించకుండా.. ప్రేక్షకులూ ఆమె అభినయానికి అలవాటు పడ్డారు. అందుకే దాదాపు అందరు హీరోస్ సాయిపల్లవి ప్రెజెన్స్ ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తోన్న సాయి … మరో వైపు దగ్గుబాటి రానా హీరోగా నటిస్తోన్న ‘విరాటపర్వం’ లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. ఈ రెండూ విడుదలకు సిద్దమవుతుండగా.. సాయిపల్లవి.. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు హీరోలతో రొమాస్స్ రిపీట్ చేస్తుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
నానీ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘యం.సీ.ఏ’ లో కథానాయికగా నటించింది సాయి పల్లవి. అందులో అమ్మడి పెర్ఫార్మెన్స్ సినిమాకి అదనపు ఆకర్షణ అయింది. అంతేకాదు ఈ ఇద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అందుకే ప్రస్తుతం నానీ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగ రాయ్ లో సాయిపల్లవి మరోసారి హీరోయిన్ గా నటించబోతోంది. ఇక ‘పడిపడి లేచె మనసు’ మూవీలో శర్వానంద్ తో జోడీ కట్టిన సాయిపల్లవి.. శర్వా నటిస్తోన్న తాజా చిత్రంలో అమ్మడు కథానాయికగా నటించబోతోంది. సో.. ఒకేసారి ఇద్దరు హీరోలతో రిపీటెడ్ గా రొమాన్స్ ను ఒలికించబోతున్న సాయిపల్లవి .. ఆ సినిమాలకి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.