రాజకీయ నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. చివరకు న్యాయమూర్తులను కూడా దూషిస్తూ కొందవరు యాక్టివిస్టులు వికృత పర్వాన్ని నడిపిన తీరును ప్రస్తావించిన కోర్టు…చట్టానికి లోబడి పోలీసులు చర్యలు తీసుకుంటూఉంటే… అందులో తప్పు పట్టాల్సిందేం ఉందని ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కారణాన్ని చూపి పోలీసులు పదుల సంఖ్యలో యాక్టివిస్టులను అదుపులోకి తీసుకుని హింసిస్తున్నారని, ఈ తరహా నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ పిల్ లో పిటిషనర్ కోరిన మేరకు అరెస్ట్ అను నిలుపుదల చేసే దిశగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చి చెప్పింది.అంతటితో ఆగని కోర్టు ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనం ఏముందని కూడా పిటిషనర్ ను నిలదీసింది. ఇలాంటి వ్యవహారాలపై పిల్ వేయడమే తప్పన్న రీతిలో కోర్టు తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైసీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆర్టీఐ కమిషనర్ పోస్టును దక్కించుకున్న సీనియర్ జక్నలిస్టు విజయబాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఏకబిగిన పదుల సంఖ్యలో వ్యక్తులను అదుపులోకి తీసుకుని… వారిపై పోలీసులు తమ జులుం ప్రదర్శిస్తున్నారని, తక్షణమే ఈ దమన నీతికి అడ్డుకట్ట వేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజయబాబు తన పిల్ లో కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభంలోనే అసలు ఈ వ్యవహాారంపై పిల్ ఎలా దాఖలు చేస్తారని కూడా హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు కీలక స్థానాల్లో ఉన్న నేతలు, వారి కుటుంబ సభ్యులు, చివరకు సదరు నేతల కుటుంబాల్లోని మహిళలను కూడా కించపరస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎవరు నిలువరిస్తారని కోర్టు ప్రశ్నించింది.
తమకు అనుకూలంగా ఉన్న నేత తప్పును నిర్ధారించి… చర్యలకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తులను కూడా లక్ష్యంగా చేసుకుని గతంలో ఇదే సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టిన వైనాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. తప్పు చేసిన వారిని నిలువరించేందుకే చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలకు లోబడి వ్యవహరిస్తున్న పోలీసులను నిలవువరిస్తే… ఇక తప్పులు చేస్తున్న వారిని ఎవరు నిలువరిస్తారని కూడా కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ నోటికి ఏది వస్తే దానిని అలాగే విడుల చేస్తామంటే… మరి అవతలి వారి హక్కులను కాపాడేది ఎవరు అని కోర్టు పిటిషనర్ ను దాదాపుగా నిలదీసినంత పని చేసింది.
ఈ వ్యవహారంలో పోలీసులను కట్టడి చేసే దిశగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పై తాము స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేస్తామని కూడా కోర్టు తెలిపింది. ఒక వేళ అరెస్టైన వారికి అన్యాయం జరిగిందని భావిస్తే… ఆయా వ్యక్తులు ప్రత్యేకంగా కోర్టులను ఆశ్రయించవచ్చని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. మొత్తంా స్వామి భక్తి ప్రదర్శించుకుందామని హైకోర్టు మెట్లెక్కిన విజయబాబు కోర్టుతో మొట్టికాయలు వేయించుకోక తప్పలేదు.