జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు నిన్ననే పూర్తయ్యాయి. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ ఆదివారంనాడు కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎక్కడ ఆగాయో ఎస్ ఈ సీ అక్కడ నుంచే కొనసాగిస్తున్నట్లు న్యాయవాది వివరించారు. నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బంది అంతా సిద్దంగా ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఎల్లుంటి తీర్పును వెలువరించనుంది.