తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టి నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూనే, తనకు ఇష్టమైన వ్యాపకాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు ఆమె. ఆదివారం ఆమె పుదుచ్చేరిలో లోని ఒక ఫారెస్టను విజిట్ చేశారు. ఉన్నతాధికారులు, అధికారులతో కలిసి కాలి నడకన ఫారెస్టు మొత్తం కలియతిరిగారు. మొక్కలు నాటారు. ఫారెస్టులో ఉన్న వన్య ప్రాణులను తిలకించారు. ఈ సందర్భంగా భారీ కొండ చిలువను ఆమె తన చేతిలోకి తీసుకొని అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచారు. జంతువులకు, వన్య ప్రాణులకు వైరస్ సోకకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
It was truly Thrilling & Unique Experience visiting to Urban Forest located at #Puducherry along with Advisors & Officials to assess the Revival & Promotion of Pudhucherry Tourism Potential post Pandemic. Proactive Strategies & Initiatives
are planned to attract more tourists pic.twitter.com/3MCzYtcT6B— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 4, 2021