ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పదవీ కాలం ముగియడంతో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన మండలి చైర్మన్‌గా మహ్మద్ ఇక్బాల్ పేరు ఖరారైంది. ఇక డిప్యూటీ ఛైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైంది. త్వరలో వీరు పదవులు చేపట్టవచ్చని తెలుస్తోంది.
మరికొన్ని పదవులకూ..
వైసీపీలో పదవుల పంపకాలకు చురుగ్గా కసరత్తు సాగుతోంది. కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు మరో పది నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావహులు ఇప్పటికే వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పదవుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Must Read ;- రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్ లు : ప్రభుత్వం ఉత్తర్వులు











