విశాఖ ఎంవీపీ కాలనీలోని హెడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థ షెడ్డును జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. కాగా ఈ సంస్థ ద్వారా 75 మంది వరకు మానసిక వికలాంగులకు సేవలందిస్తున్నారు.లీజు పూర్తికావడంతో కూల్చేవేశామని జీవీఎంసీ అధికారులు అంటుండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని సంస్థ నిర్వాహకులు వాపోతున్నారు. కాగా జీవీఎంసీ అధికారుల చర్యను మానసిక వికలాంగుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మానసిక వికలాంగులకు సేవలందించే సంస్థ షెడ్డు కూల్చేవేత ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
Must Read ;- అరెస్టులు, కూల్చివేతలు, కరోనా మరణాలు కప్పిపుచ్చేందుకేనా?