ఏపీ ప్రభుత్వం అగ్రకులాల సంక్షేమాభివృద్ధి కి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తాయి. కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థికంగా చేయూతను అందనుంది. అయితే ఓటు బ్యాంకు కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని పలువురు ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
Must Read ;- ఏపీ బడ్జెట్ రూ.2,29,779 కోట్లు.. నవరత్నాలకే పెద్ద పీట










