అధికార పార్టీ వైసీపీలో జాతి రత్నాలు ఉన్నారని, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చేస్తున్నారని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. బుధవారం ఆమె మీడియా తో మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్లు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులకు, నాయకులకు ఓటర్లు భయపడొద్దని, నిజమైన నాయకులనే గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లకు ఉందని, టీడీపీకే ఓటు వేయాలని అనురాధ పిలుపునిచ్చారు.
Must Read ;- టీడీపీ నేతల నోట కోవర్టుల మాట.. వైసీపీ, బీజేపీల్లో టెన్షన్ !