ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకొండి – స్టాలీన్
టమాట ధర దేశ వ్యాప్తంగా అమాంత పెరిగింది. భారీ వర్షాలు, సాగు నష్టాలు కారణంగా ఈ ఏడాది టమాట దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనితోడు విపరీతమైన వర్షాలు, వరదలు కారణంగా టమాట ధరలకు రెక్కలొచ్చాయి. ఏపీలో బహిరంగ మార్కెట్లో పెట్రోల్ ధరను మించిపోయింది టమాట ధర. ప్రస్తుతం కీలో ధర రూ. 130 నుంచి 150 మేరకు పలుకుతూ ఠారెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో దార్మినిక ముఖ్యమంత్రి స్టాలీన్ తమిళనాడులో టమాట ధరల నియంత్రణపై కన్నెశాడు. ధరలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.70 కన్నా మించి అమ్మితే .. దానిపై అధికారులు బాధ్యత వహించాల్సి వస్తోందని హెచ్చరించారు కూడా. గతంలో కూడా కేంద్రం తగ్గించిన పెట్రోల్, డిజీల్ ధరలకు ఆదనంగా కొంత వ్యాట్ ను తగ్గించి తమిళ ప్రజలకు ఉపసమనం కల్పించారు స్టాలీన్. కానీ ఏపిలో ఇందుకు భిన్నంగా పాలన సాగితోంది. పొరుగు రాష్ట్రాల పాలన చూసైనా ఏపీ సీఎం జగన్ బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల ఓట్లైతే కావాలి కానీ .. ప్రజల సూచనలు,సలహాలు పట్టావా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
స్టాలీన్ కు మద్దతుగా వ్యాపారులు ..
తమిళనాట టమాట కీలో రూ.70 కన్నా అధనంగా అమ్మకాలు జరిపితే .. అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి స్టాలీన్ కు వ్యాపారులు కూడా ప్రజా సంక్షేమం కోసం వారి లాభాలను వదులుకోవాడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వం నిర్ధేశించిన కీలో ధర రూ.70 లకు మరో రూ.20 తగ్గింపు ధరను జోడించి .. రూ.50 లకే కీలో టమాట అందించేందుకు వ్యాపారులు మందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వం, ట్రేడ్ వర్గాల ఉదారతకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరి ఏపీలో దిక్కుమాలిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పొల్చుకుంటే ఇక్కడ పెట్రోలు, డిజీల్, నిత్యావరస సరుకుల ధరలు, పవర్ బిల్లులు, మద్యం చివరకు టమాట ధరలు కూడా అధికమే. దార్మినిక పాలన విధానాలు లోపించడం కారణంగానే ఏపీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిరుపేదలపై నిత్యావరస సరుకుల ధరాఘాతం జీవన పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. రూ.10 నుంచి 15 రూపాయాలు పలికే టమాల పదింతలు పెరిగి రూ.150 లు పలుకుతూ… వికట హట్టహాసం చేస్తుంటే ఏపీ ప్రభుత్వం వికృత చేష్టాలకు పాల్పడుతోంది. ఇసుక, మద్యంపై ఉన్నంత ప్రేమలో పదిశాతం పాలనను గాడిలో పెట్టడంపై చేస్తే రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేదని ప్రజలు వాపోతున్నారు.











