మున్నిపల్ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో పటిష్ట సన్నాహాలు చేస్తుంది ఏపీ ఈసీ. పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారిపై దృష్టి సారించింది. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మున్నిపల్ ఎన్నికలకు వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించింది ఈసీ. వాలంటీర్లపై పలు ఆంక్షలు విధించింది. వారి ఫోన్లలో లబ్దిదారుల డేటా దుర్విణియోగం కాకుండా చూడాలని ఈసీ నిమ్మగడ్డ సూచించారు.
వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారు పత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. ఎన్నికల వ్యవహారంలో తలదూర్చకుండా చూసుకోవాలని నిమ్మగడ్డ చెప్పారు. వాలంటీర్ల చేత ఓటరు స్లిప్ ల పంపిణీ లాంటి పనులు చేయకూడదని కూడా తెలియజేశారు. వాలంటీర్లు అభ్యర్ధల తరపున ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కూడా నిమ్మగడ్డ చెప్పారు.










