కుప్పకూలిన రవాణ రంగానికి ఊతం..!
ఏపి రవాణ రంగం ఏం పాపం చేసిందో కానీ.. జగన్ మోహన్ రెడ్డి పుణ్యమాంటూ ఏపీలో రవాణ రంగం కుప్పకూలింది.
ఏపీలో రవాణ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కష్టాల్లో కునారిల్లుతున్న ఆ రంగాన్ని ఆదుకునేందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. లోకేష్ ఇచ్చిన ఆ ఒక్క హామీతో జవసత్వాలు వచ్చాయి. రక్తాన్ని చెమటగా మర్చి కష్టిస్తున్న రవాణ రంగ కార్మికులపై జగన్ రెడ్డి ప్రభుత్వం మోపుతున్న పన్నుల భారం నుంచి పూర్తిగా ఉపసమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే గ్రీన్ టాక్స్, పెంచిన రోడ్డు టాక్స్ లను తక్షణమే రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా రవాణ రంగంపై త్రైమాసిక పన్నును 80 శాతం పెంచడంతో ట్యాక్సీ, ఆటో, ట్రాన్స్‌పోర్టు తదితర రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఏపీలో యువనేత లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్రలో అడుగడుగునా లారీ అసోసియేషన్ సంఘాల అధ్యక్షులు జిల్లాల వారీగా వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. లోకేష్ తో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమాలు తమ గూడును విన్నవించుకుంటున్నారు. విజయవాడ నుంచి నిడమానూరు వరకు సాగిన లోకేష్ పాదయాత్రలో రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు విడిపి పత్రాన్ని అందించారు.
లారీ రవాణా రంగాన్ని ఇబ్బంది పెడుతున్న గ్రీన్ టాక్స్, ఓవర్ లోడ్ టాక్స్, డీజిల్ పై అదనపు టాక్స్, త్రైమాషిక పన్నులకు సంబంధించి పన్నులను వెంటనే తగ్గించాలని విడదీపత్రంలో కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులను విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలానే పాతిక లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు