తాత జిల్లాలో మనవుడి వ్యూహాత్మక అడుగులు.. జరిగే భారీ మార్పులు ఇవే..!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత జిల్లా అయిన ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మూడు రోజులు పాటు వ్యూహాత్మకంగా సాగనున్నది.
దీని కోసం శ్రేణులు భారీ ఏర్పాట్లును చేపట్టాయి. ఈ సందర్భంగా 188 రోజులు పాటు సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలు రాయిని పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఉండవల్లి, సీతానగరం వద్ద నాయకులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే విజయవాడలో మూడు రోజులు పాటు లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆశేష జనం, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. వీరితోపాటు మరోవైపు అధికారపార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. లోకేష్ అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అందులో విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నుంచి వైసీపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. మరో వైపు గన్నవరం నుంచి కూడా వైకాపా అసమ్మతిరాగం ఇప్పటికే రీసౌండ్ చేస్తోంది.
కృష్ణాజిల్లా అంటేనే చైతన్యవంతమైన రాజకీయాలకు పెట్టింది పేరు. అంతేకాక రాజకీయ ఉద్దండుల ఖిల్లా కూడా. ఇక్కడ నేతలే బ్రిటిష్ వారిని గడగడలాండించారు. దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టించారు. అంతటి రాజకయ ఘటికల్లో ముందు వరసలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు ఉండనే ఉంది. అందుకే నూతన ఒరవడితో యువగళం పాదయాత్ర ఇక నుంచి సాగనున్నది. తాత స్పూర్తితో సాగుతున్న పాదయాత్రలో ఇక సందేశాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారు.అంతేకాక స్వపక్షంలో విపక్షం మాదిరిగా ఉన్న వారికి క్రమశిక్షణా.., అధికార పక్షంలో కారాలు, మిరియాలు నూరే వాళ్ళకు అల్టీమేటం వంటివి పాదయాత్రలో ప్రత్యేక ఎజెండాగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలానే అసంతృప్తి వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించేలా ఆపరేషన్ ఆకర్ష్ వంటి పథకాలకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ యువగళం ఇక దూకుడు పెంచనున్నట్లు సంకేతాలు హింట్స్ రూపంలో అందుతున్నాయి. తెలుగు దేశం పార్టీకి కంచుకోటలాంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రానున్న ఎన్నికల్లో తెలుగు దేశాన్ని క్లిన్ స్వీప్ చేసేలా పావులు కదుపుతున్నారు యువనేత. అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపరేషన్ పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో వైసీపీలో రాజకీయ వ్యభిచారులుగా పేరుమోస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగే వైసీపీ మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇక పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ వర్గాలు గుస గుసలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి. గన్నవరం నుంచి ప్రారంభమైన అసమ్మతి రాగం కృష్ణా జిల్లా మొత్తాన్ని చుట్టుటం ఖాయమని రాజకీయం విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్తలు విన్న తాడేపల్లి పిల్లి సైనం బ్యాలెన్స్ తప్పి.. ఎగిరేగిరి పడుతున్నట్లు సమాచారం..