విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఇప్పటికే భారం మోపిన జగన్ సర్కార్, ఇప్పుడు వినియోగదారుల్లో కొత్త అలజాదులు సృష్టిస్తోంది. పెరిగిన ఛార్జీలతో బిల్లు ఏ మేరకు వస్తుందో అనే ఆందోళన ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అయితే తాజాగా ఏపీఈపిడిసిఎల్ మీటర్ రీడర్లకు జారీ చేసిన ఆదేశాలు ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి.
విద్యుత్ రీడింగ్ తీసిన వెంటనే బిల్లును వినియోగదారుల చేతికి ఇవ్వద్దంటూ ఏపీఈపిడిసిఎల్ 400240 పేరిట ఓ మెమోలో పేర్కొంది. ఇది ఈ నెల రెండవ తేదీన జారీ చేయబడింది.అయితే విద్యుత్ తయారీ మారినందున సాఫ్ట్ వేర్ ను సారి చేసి విద్యుత్ వాడకానికి తగ్గట్లుగా చార్జీలను వేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ మీటర్ రీడర్ల దగ్గర ఉన్న పరికారాల్లో కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయలేదు.కాగా పాత టారిఫ్ మేరకు బిల్లింగ్ డేటా ఉన్నందున వాటిని సమూలంగా కొత్త టారిఫ్ మేరకు మార్చాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో రీడింగ్ కోసం వినియోగదారుల ఇళ్లకు వెళ్ళే రీదార్లు కేవలం స్పాట్ రీడింగ్ మాత్రమే తీయాలని, ఆ బిల్లును మాత్రం ప్రింట్ తీయవద్దంటూ ఈ మేమో ద్వారా ఏపీఈపిడిసిఎల్ రీడర్లకు ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి ఈ కొత్త టారిఫ్ బిల్లు లను కార్పొరేట్ ఐటి వింగ్ ఇస్తుంది. ఏటా విద్యుత్ సంస్థలు ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ లను అమలు చేస్తాయి. ఇదే విధానం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30 వరకూ కూడా కొత్తగా వచ్చిన సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకునేందుకు సమయం ఉంటుంది. అయితే మార్చి నెలకు సంబందించిన బిల్లు ఈ నెలలో వస్తుంది, అదీ 2021 – 22 టారిఫ్ మేరకే ఇస్తున్నారు. అయితే ఏప్రిల్ మాసానికి సంబంధించిన బిల్లులు వచ్చే నెల అంటే మే లో తీయాల్సి ఉండగా.. మీటర్ రీడింగ్ కు సంబంధించిన స్పాట్ బిల్లు ప్రింట్ ఇవ్వద్దoటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం పై ప్రజల్లో ఆందోళన మొదలైంది. అదేసమయంలో వినియోగదారులకు కరెంటు వాడకానికి చెల్లించాల్సి మొత్తం ఎంతో ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేస్తాం అని ఏపీఈపీడీసీఎల్ జారీ చేసిన మేమోలో పేర్కొంది.
అసలే భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు వినియోగదారుల్లో ఒకవైపు ఆందోళనలు రేకెత్తిస్తుండగా, నెలవారీ విద్యుత్తు వినియోగం ఎంతో, దానికి వసూలు చేస్తున్న బిల్లు ఎంతో తెలుసుకునే వెసులుబాటు లేకుండా ఎప్పుడో ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారాన్ని పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధానాలను ఏపీఈపీడీసీఎల్ అనుసరించడంపై వినియోగదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ నెల బిల్లులను మే మొదటివారంలో యధాతదంగా స్పాట్ బిల్లింగ్ రూపంలో ప్రింట్ ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు.