వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది.మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పర్యటిస్తుండగా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే మాంగాడు చెరువుకు సంబంధించి రంగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో రోజా హామీ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ సమస్య పరిష్కారం దిశగా కనీసం చర్యలు తీసుకోలేదని రోజాను స్థానికులు నిలదీశారు. ఇక అదేసమయంలో గత ప్రభుత్వ హయాంలో తాము తమ గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమిని ఏపిఐఐసికి ఇచ్చామని, ఏపీఐఐసి ఛైర్మన్ గా ఎమ్మెల్యే రోజా ఒక్క సంస్థ కూడా ఎందుకు సొంత నియోజకవర్గానికి తేలేకపోయారని వారు ఆమెను ప్రశ్నించారు. అసలు ఎనిమిదేళ్లుగా నగరి ఎమ్మెల్యే గా ఉన్న మీరు మా నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలంటూ రోజాను స్థానికులు అడ్డుకున్నారు.దీంతో సమాధానం చెప్పలేక రోజా స్థానిక దళిత యువకులపై కోపంతో ఊగిపోయారు. ఒకానొకదశలో రోజా యువకుల పై చెయిజేసుకునే వరకు వెళ్లారు. అయితే అక్కడి వారు మొత్తం ఉదంతాన్ని ఫోన్ లో చిత్రీకరిస్తుండడంతో రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు
కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...