విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగిందని వైసీపీ ఎంపీ తప్పుడు ఫిర్యాదు చేశారని పార్లమెంట్ సభాహక్కుల సంఘం తేల్చింది. 2017 జనవరి 26న విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి జరిగిందని ఎంపీ విజయసాయి పార్లమెంట్ సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు లేవని, దీంతో అది సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని పేర్కొన్నారు. పార్లమెంట్ సభాహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలతో సభాహక్కుల సంఘం 70వ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఆ నివేదికలో విజయసాయి ఫిర్యాదు విషయాన్ని పేర్కొన్నారు.
Must Read ;- మోగదన్నవాడే మోగించాడు.. రక్తి కట్టని విజయసాయి డ్రామా!











