July 7, 2026 4:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ప్రకటనపై అనుమానాలెన్నో..  విశాఖ ఉక్కు భూముల విక్రయం సాధ్యమా..?

విశాఖ ఉక్కు ప్రవేటు పరం కాకుండా సీఎం జగన్‌తో కార్మిక సంఘాల నేతలు చర్చించిన సందర్భంగా ప్రసావనకు వచ్చిన పలు అంశాల అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

February 17, 2021 at 7:35 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అధికార వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా బుధవారం విశాఖకు వెళ్లిన సీఎం జగన్ శారదాపీఠాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో విశాఖ స్టీల్ కార్మిక సంఘాల్లోని కొందరు నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు నాయకులు చెబుతున్నారు. ప్రైవేటు పరం చేయకుండా తమ ముందున్న అంశాలేంటనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అందులో భాగంగా పోస్కోకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, అప్పులను ఈక్విటీగా మార్చడం, గనుల కేటాయింపు చేయడంతోపాటు కంపెనీకి ఉన్న భూముల్లో ప్రస్తుతం వినియోగం లేని 7వేల ఎకరాల భూమి విక్రయం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటిల్లో కంపెనీ అప్పులను ఈక్విటీ రూపంలో మార్చడం, గనుల కేటాయించడం లాంటివి కేంద్రంతో చర్చించవచ్చు. ఇక పోస్కోను విశాఖలో కాకుండా కడపకు తరలిస్తామని, అదీ కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేసినా సహకరిస్తామని వ్యాఖ్యానించినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమావేశంలో ప్రధానికి తాను రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కుకు కావల్సిన గనులపైనా జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాగా గతంలో పోస్కో ప్రతినిధులు కలిసిన సమయంలోనే తాము విశాఖలో కంపెనీ ఏర్పాటు సాధ్యం కాదని, కడపలో ఏర్పాటు చేయమని సూచించినట్టు తెలిపారు. వీటితోపాటు విశాఖలో ఉత్పత్తి దెబ్బతినకుండా ఆందోళనలు చేయడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం, సొంత గనులు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం, అప్పులపై వడ్డీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని పరిశీలిస్తే..

విశాఖ స్టీల్ కంపెనీకి గనులపై చర్యలేవి?

శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేసినా సహకరిస్తామని చెప్పారు. పోస్కోకు సొంత గనులు ఉన్నాయా..ఆ కంపెనీకి గనుల కేటాయింపు సాధ్యమైనప్పుడు కేంద్రంతో మాట్లాడి అవసరమైతే డబ్బులు చెల్లించి విశాఖ స్టీల్ కంపెనీకి కూడా గనులు తీసుకోవచ్చు. ఆ దిశగా వేగంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. కాగా ఇప్పటికే విశాఖ స్టీల్ కంపెనీ ప్రవేటీకరణ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో గంగవరం పోర్టు, విశాఖ పోర్టుల విషయంలోనూ ప్రైవేటు ఆధిపత్యం నడిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించనున్నాయనే సందేహాలు గతంలో తలెత్తాయి. మరి ఇప్పుడు భావనపాడు పోర్టు ప్రాంతంలో పోస్కోకు అవకాశం ఇస్తామనడం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. రెండురోజుల క్రితం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..విశాఖ స్టీల్ భూములపై పోస్కో కన్ను పడిందని, ఆ కంపెనీ ఒడిషాలోనో లేక బెంగాల్ లోనో పెట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు కూడా. 2019లో ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్లమెంటులో సదరు మంత్రి ప్రకటించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదు. దీంతో తాజాగా చర్చకు వచ్చిన ప్రతిపాదనలపై అనుమానాలు వ్యక్తం కావడంతోపాటు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డకోగలుతుందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి.

Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

భూముల విక్రయాలా..

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న 26 వేల ఎకరాల భూమిలో 7వేల ఎకరాలు ఉపయోగించడం లేదన్న కారణంతో ప్రైవేటు ప్లాట్లు చేసి విక్రయించడం, సదరు డబ్బులు, ప్లాట్‌ల విక్రయ బాధ్యత విశాఖ స్టీల్‌కి అప్పజెప్పడమనే ప్రతిపాదన వచ్చింది. అలా ప్లాట్లు విక్రయించిన డబ్బుతో విశాఖ స్టీల్‌కి ఉన్న దాదాపు రూ.2500కోట్ల అప్పు తీర్చవచ్చు, గనులు కొనుగోలు చేయవచ్చు అనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూముల విక్రయానికి తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుందని జగన్ చెప్పారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పనే కాబట్టి భూముల విక్రయానికి సిద్ధపడతారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విశాఖ కంపెనీ నుంచి గుండుపిన్ను పోయినా.. సెంటిమెంట్ పరంగా కోట్లాది మంది భావోద్వేగాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 7వేల ఎకరాల విక్రయం ఏంటనే చర్చ నడుస్తోంది. 1965 నుంచి లెక్కిస్తే దాదాపు 20 ఏళ్ల పోరాటం, శ్రమతో విశాఖ స్టీల్ కంపెనీ పూర్తిస్థాయి నిర్మాణం (1990లో) పూర్తయింది. 32 మంది ప్రాణాలు త్యాగం చేయడం, 22వేల మంది రైతులు అప్పట్లో భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం, వాటిలో కొన్నింటికి ఇంకా పరిహారం ఇవ్వక పోవడం, ఆ భూములు కాకుండా కురుపాం జమీన్ దారులు ఇచ్చిన 6వేల ఎకరాలు ఎలా విక్రయిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గనులు కేటాయించేలా చేయడం ద్వారా..ఆ భూములను వినియోగించి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పెంచి కూడా లాభాల్లోకి తెచ్చే అంశం ఎందుకు విస్మరించారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ కమిటీల నివేదికలేవీ..

ప్రభుత్వం చెబుతున్నట్లు.. విశాఖ స్టీల్ కంపెనీకే భూముల విక్రయ బాధ్యతలు అప్పజెప్పినా.. అసలు భూముల విక్రయం వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. కాగా విశాఖపట్నంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూముల కబ్జాలు చేస్తున్నారని, ఓ ముఖ్య నాయకుడు అదే పనిమీద ఉన్నాడన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏంటనే చర్చ నడుస్తోంది. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్నసమయంలో సబ్ కమిటీ వేసింది. జగన్ సర్కారు కూడా ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికల్లో ఏముందనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. అలాంటిది ఇప్పుడు విశాఖ స్టీల్ భూముల విక్రయం ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

పురపాలక ఎన్నికల్లో భాగమేనా?

కాగా ఏపీలో మొత్తం వైసీపీ గాలి వీచినా..విశాఖలో 2019 ఎన్నికల్లో టీడీపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ నాలుగు గ్రేటర్ విశాఖ పరిధిలోనూ, చుట్టుపక్కల ఉన్నవే. ఈ నేపథ్యంలో విశాఖలో పట్టు పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పదేపదే అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలు కూడా అందులో భాగమే అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు సర్కారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద కొన్ని అంశాలు తప్ప..మిగతా వాటి విషయంలో ప్రభుత్వం మడమ తిప్పకుండా అమలు చేస్తే.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో బుధవారం నాటి చర్చలు కూడా కేవలం డైవర్ట్ చేసే చర్యగా భావించాల్సి ఉంటుంది. రానున్న కాలంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని బట్టి దీనిపై క్లారిటీ రానుంది.

Also Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం

Tags: Editorspickhow many possibilities in their suggestionsjagan discussed with union leaders on visaka steel privatisationleotopso many doubtstelugu news
Previous Post

అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

Next Post

సీటు కోసం సిగపట్లు.. టీడీపీలో విజయవాడ మేయర్ పంచాయితీ!

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ఈడీకే న‌కిలీ మ‌కిలీ అంటించేశారే

జగన్ మార్క్ న్యాయం.. సుగాలి ప్రీతి కేసు అటకెక్కేసిందా?

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist