బెయిల్ మంజురు కండీషన్స్ ఇలా ..
వాణిజ్య పన్నుల శాఖలో బీకాం డిగ్రీ చదకపోయినా, చదివినట్లు తప్పుడు విద్యార్హత ధ్రువపత్రాల సమర్చించారని విజయవాడకు చెందని మెహర్ కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ను నిన్న గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. పీఆర్సీ పై ఉద్యోగులు ఉద్యమిస్తుంటే.. ఒక ఎన్జీవో మాజీ అధ్యక్షుడిగా వారివైపు ఫేవర్ గా మాట్లాడి, ప్రభుత్వ చర్యలను ఎండగట్టిన నేరానికి అశోక్ బాబును అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పలువురు పార్టీ ముఖ్య నాయకులు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరు సీఐడీ కార్యాలయంలో 17 గంటలపాటు విచారణ ముగిసిన తరువాత అశోక్ బాబును భారీ బందోబస్తు నడుమ విజయవాడకు తరలించారు. అంతకు ముందు కోవిడ్ పరీక్షలు చేయించగా.. నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో విజయవాడ సీఐడీ కోర్టుకు తీసుకెళ్లి.. అశోక్ బాబును జడ్జి ముందు హాజరుపరిచారు. సీఐడీ దాఖాలు చేసిన ప్రతాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ అశోక్ బాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజురు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజురు చేసింది కోర్టు!











