14న జరగాల్సిన ప్రమాణ స్వీకారం వాయిదా..
శ్రీశైలం దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 84ను ఈ నెల 3న జారీ చేసింది. అయితే ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సభ్యులు నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపించారు. ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో.. గిరిజనులకు ప్రాతినథ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని.. కానీ ప్రస్తుత ట్రస్ట్ బోర్డులో అలా లేదని ధర్మాసనం దృష్టికి తీసుకుచ్చారు. పిటిషనర్ తరుపున న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలకు ధర్మాసనం ఏకీభవించింది. ఈ నెల 14న జరగాల్సిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వచ్చె బుధవారానికి వాయిదా వేసింది.











