కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్రంగా ఆవేదన చెందుతున్న హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు రోగ నిరోధన శక్తిని పెంపొందించే మందుల్ని అందించడానికి ‘అర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్’ యాజమాన్యం వారు ముందుకొచ్చారు. ఈ సంస్థకి చెందిన డా.వియస్బీ బండి, డా. అన్నపూర్ణ గార్లు ఈ మందుల్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లోని రోగులకు కూడా ఈ మందుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముప్పై లక్షల విలువ చేసే మందుల్ని కేన్సర్ హస్పిటల్ కు అందజేశారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కు చెందిన డా.వియస్బీ బండి, అన్నపూర్ణలు దాతృత్వం హిందూపురం ప్రజలతో పాటు కేన్సర్ రోగులకు ఎంతో మేలు చేస్తుందని, ఇలాంటి ఉదారత చూపిన వీరికి బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా, హిందూపురం ప్రజల శ్రేయస్సుకు తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగా.. ఈ మందుల్ని అక్కడివారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.











