బాలయ్యబాబు, పూరి ల మధ్య ఎక్కడో తేడా కొట్టింది. అందుకే తేడా సింగ్ గా బాలయ్య చూపించిన ఈ పాత్ర బాగానే పండినా సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. తేడా సింగ్ ఎవరంటే మరో ఆలోచనలేకుండా తెలుగు సినీ ప్రేక్షకులంతా ముక్త కంఠంతో చెప్పే ఏకైక పేరు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో బాలయ్య చేసిన ‘పైసా వసూల్’ సినిమాలో తేడా సింగ్ క్యారెక్టర్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య రియల్ క్యారెక్టర్ కి ఈ రీల్ క్యారెక్టర్ తో చాలా పోలికలు సరిపోవడంతో నందమూరి అభిమానులకు మాత్రం ఇది పైసా వసూల్ మూవీ అయింది.
వాస్తవానికి ఈ సినిమాతో బాలయ్య తన యాంటీ ఫ్యాన్స్ కి కూడా విపరీతంగా నచ్చేశాడు. పూరీ మార్క్ డైలాగ్స్ తో పైసావసూల్ లో బాలయ్య తన నట విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకులకి రుచి చూపించాడు. అయితే పూరీ తో వర్కింగ్ చాలా కంఫర్ట్ గా ఉండంతో బాలయ్య మరోసారి తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని బహిరంగంగా ప్రకటించాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం పూరీకి ఈ మధ్యే బాలయ్య నుంచి వర్తమానం వెళ్లిందట, తనను దృష్టిలో పెట్టుకుని పైసా వసూల్ స్టైల్ లో ఓ స్టోరీ రెడీ చేయాల్సిందిగా పూరీకి బాలయ్య ఆఫర్ కమ్ ఆర్డర్ ఇచ్చాడని సమాచారం.
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలక పనులు ముగిసిన వెంటనే బాలయ్యకు ఓ స్టోరీ రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. పూరీ స్టోరీ రాసిన వెంటనే సెట్స్ మీదకి వెళ్లేలా ఈ సినిమాకి బాలయ్య సైడ్ నుంచి ఆల్రేడీ పర్మీషన్ కూడా వచ్చిసిందని టాక్. ఈ సినిమాను బాలయ్య తన సొంత బ్యానర్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.