గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఎగ్మా, వెంటిలేటర్ పైనే బాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం సాయంత్రం 6.30 గంటలకు అధికారికంగా వెల్లడించాయి. ఇతర ప్రాణాధార చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఆయనను చుట్టుముట్టినట్టు సమాచారం. కరోనా వ్యాధితో బాధపడుతున్న బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్సపొందుతున్నారు. ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని జనావళికి అందిస్తూనే ఉన్నారు. ఆయన త్వరగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా చరణ్ ఇటీవల వెల్లడించారు.
మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల కానుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సమాచారం. బాలు త్వరగా కోలుకోవాలని ప్రపంచవాప్తంగా అందరూ కోరుకుంటున్నారు. గత 40 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్నారు. మొదట్లో కరోనా పాజిటివ్ వచ్చినా కోలుకున్నాక పరీక్షలు చేసి నెగిటివ్ గా నిర్ధారించారు. కాకపోతే ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జి చేయలేదు. ఈ గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యంపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే వైద్యులు ప్రకటించాల్సిందే. ఈ వార్త తెలిసిన వెంటనే బాలు అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ట్వీట్లతో బాలు ఆరోగ్యానికి భరోసా
బాలు ఆరోగ్యం క్షీణించిందని తెలిసిన వెంటనే ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సినీ ప్రముఖులందరిలోనూ విషాదం నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు. స్వరార్చన చేశారు. బాలుకు ఏమీ కాలేదు.. కాబోదు అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. తమన్ కూడా ట్వీట్ చేశారు. బాలు పరిస్థితి విషమం అని తెలియడంతో సినీ ప్రముఖులంతా చెన్నై ఆస్పత్రికి చేరుకుంటున్నారు. బాలుకు అత్యంత సన్నిహితుడు కమల్ హాసన్ కూడా ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలిసింది.
https://twitter.com/ThisIsDSP/status/1309113475180961793
https://twitter.com/MusicThaman/status/1309107081635598337











