ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. సమర్ధవంతమైన న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం ఫిర్యాదు చేయడం షాక్ కు గురిచేసిందని బార్ కౌన్సిల్ తెలిపింది.
చీఫ్ జస్టిస్ కాబోయే జాబితాలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం ఆమోద యోగ్యం కాదని వెల్లడించింది. ఆంద్రప్రదేశ్ హైకోర్టు, న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి లేఖ రాయడంపై తమ నిరసనను తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించడం సహేతుకం కాదని బార్ కౌన్సిల్ హితవు చెప్పింది.
‘జగన్ భ్రమల్లో ఉన్నారు..’ : సుప్రీం సీజేకు మాజీ న్యాయమూర్తి లేఖ
న్యాయస్థానాలు, తీర్పులు, న్యాయమూర్తులపై కూడా గత కొన్ని రోజులుగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి చర్యలను సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి రావడాన్ని మనం ఊహించలేమని విచారాన్ని వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల విశ్వసనీయత దెబ్బతీసేందుకే.. జగన్ లేఖ రాశారని బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. జగన్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసింది. న్యాయ సూత్రాల క్రమశిక్షణ మేరకు ఇటువంటి లేఖలపై న్యాయమూర్తులు బహిరంగంగా స్పందించలేరని, ఇటువంటి సమయంలో న్యాయవాదులు, బార్ కౌన్సిళ్లు గళం విప్పాల్సిన అవసరం ఉందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది.
న్యాయవ్యవస్థను అస్థిరపరచేలా.. న్యాయమూర్తులపై విమర్శల దాడి చేయడం ఇటీవలి కాలంలో పెరిగిందని, కానీ ముఖ్యమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి చర్య ఆందోళనకరమైనదని వారు పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. లేఖలో ఆద్యంతమూ తీవ్రమైన పదజాలంతో బార్ కౌన్సిల్ ఛైర్మన్, ముఖ్యమంత్రి జగన్ చర్యలను గర్హించారు.
సుప్రీంకు జగన్ లేఖ వెనుక ఎవరు? సీక్రెట్ తెలుసా?!
జగన్ లేఖలో హేతుబద్ధత లేదని ఢిల్లీ బార్ అసోసియేషన్ కొట్టిపారేసింది. న్యాయవ్యవస్థపై బురద జల్లేందుకే ఈ లేఖ రాశారని, జస్టిస్ ఎన్వీ రమణ నిబద్ధత, నైతిక విలువలు, ప్రమాణాలకు మారుపేరుగా నిలిచారని, అటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని ఢిల్లీ బార్ అసోసియేషన్ హితవు పలికింది. ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడినా సహించేది లేదని, చూస్తూ ఊరుకునేది లేదని బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. జగన్ లేఖ న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడింది.
బార్ కౌన్సిల్ రాసిన లేఖ పూర్తి పాఠం చదవండి :