సౌత్ లో ఎప్పటినుంచో అగ్ర కథానాయికగా కొనసాగుతోన్న అందాల చందమామ కాజల్ అగర్వాల్. అమ్మడికి ఇటీవల పెళ్ళి నిశ్చయమైన సంగతి తెలిసిందే. వరుడు ఆమె కోరుకున్న ప్రియుడు గౌతమ్ కిచ్లూ. ఈనెల 30న కోవిడ్ నిబంధనలకు కట్టుబడి.. లిమిటెడ్ మెంబర్స్ , ఆహ్వానితుల సమక్షంలో ముంబై లో చాలా సింపుల్ గా జరగనుంది వారిద్దరి పెళ్ళి. టాలీవుడ్ లో అయితే అతి కొద్ది మందికే పంపింది ఆహ్వానపత్రిక. కేవలం 20మందినే ఆహ్వానించింది కాజల్. అందులో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఉన్నాడు.
కాజల్ పెళ్ళికి హాజరయ్యే విషయానికి సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ తన స్పందన తెలియచేశాడు. `కాజల్ నా ప్రాణ స్నేహితురాలు. ఆమె మా ఇంట్లో వ్యక్తితో సమానం. కాజల్ కు సరైన పార్ట్నర్ దొరికాడు. అతడు చాలా మంచి వ్యక్తి. కాజల్ వివాహానికి తప్పకుండా హాజరు అవుతా. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా. చిత్రీకరణ కు కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లికి వెళతానని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపాడు. కాజల్ , శ్రీనివాస్ ఇంతవరకూ కవచం, సీత సినిమాల్లో జంటగా నటించారు. అప్పటి నుంచీ వారిద్దరూ మంచి స్నేహిలయ్యారు. ఆ కారణంగానే కాజల్ తన వివాహానికి బెల్లంకొండ హీరోని ఆహ్వానించింది.