ఇటీవల కాలంలో సినిమా పేర్లు మార్చాలనే డిమాండ్లు మన దేశం ఎక్కువ అవుతున్నాయి. టాలీవుడ్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్మీకి’ సినిమా టైటిల్ కోసం ఎన్ని వివాదాలు జరిగాయో మనకు తెలుసు. చివరికి ఆ సినిమా పేరు ‘గడ్డలకొండ గణేష్’ గా మారిస్తే తప్ప గొడవలు చల్లపడలేదు. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఎమోషనల్ గా స్పందించాడు కూడా. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పడు తాజాగా ఈ సమస్య అక్షయ్ కుమార్ నటించిన సినిమాకు ఎదురైంది. ఆయన ప్రస్తుతం ‘లక్ష్మీ బాంబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పట్నుంచీ, దానిపై రకరకాల వివాదాలు తతలెత్తుతున్నాయి. మతాంతర వివాహాన్ని చూపిస్తున్నందున ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ను మార్చమని హిందూ సేన డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆ సినిమా టైటిల్‌లో హిందూ దేవత లక్ష్మీదేవి పేరును ఉపయోగించడం వలన అని వారు వాపోతున్నారు. ఒకవేళ టైటిల్ మార్చకపోతే ఆ సినిమాపై తగు చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ సినిమా పేరు హిందూ దేవత లక్ష్మిని ఎగతాళి చేసేలా ఉందని వారు అంటున్నారు. ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో గనుక సినిమా రిలీజ్ అయితే హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తోందని వారు తెలిపారు. తమ డిమాండ్ ను నెరవేర్చకపోతే సినిమాను అడ్డుకుంటామని హిందూ సేన నాయకులూ తెలిపారు. టైటిల్ మార్చకపోతే సినిమా రిలీజ్ రోజున సినిమా హాళ్ల బయట నిరసనలు తెలియజేస్తామని వారు తెలిపారు. హిందూ సేన డిమాండ్ కు తలొగ్గి చిత్ర బృందం ‘లక్ష్మీ బాంబ్’ సినిమా పేరును మారుస్తారో లేదో చూడాలి మరి.










