కారోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతునే ఉంది. కొత్త కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతునే ఉన్నాయి. కేసుల సంఖ్య ఒక రోజు తగ్గుతుంటే.. మరో రోజు భారీగా నమోదవతున్నాయి. కరోనాకు పేద.. గొప్ప అనే తేడాలేదు. ఈ వైరస్ ఎవరికైనా సోకవచ్చు. కరోనా సికిన వారిలో ప్రముఖుల చిట్టా కూడా భారీగానే ఉంది. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కరోనా బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే నమోదవుతుంది.
కార్పొరేటర్ల నుంచి అధ్యక్షుల వరకు..
కార్పొరేటర్ల నుంచి అధ్యక్షల వరకు కరోనాబారిన పడిన వారిలో ఉన్నారు. ప్రపంచ దేశాధినేతలకు కూడా ఈ కరోనా మహమ్మారి వీడలేదు. దేశవ్యాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులూ సైతం కరోనాబారినపడిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. కరోనా లక్షణాలు ఏమీ లేనప్పటికినీ వైద్యుల సూచన మేరకు ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అలాగే తనను కలిసిన నేతలు, కార్యకర్తలు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.
కరోనా బారిన పడి ఎంతో మంది నాయకులు దేశవ్యాప్తంగా బలయ్యారు. తెలంగాణ మాజీ హోం మంత్రి నాయని నర్సింహ్మా రెడ్డి కూడా కరోనా సోకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. అలాగే ఇతర రాష్ట్రాల మంత్రులు, కేంద్రమంతులు పలువురు కరోనా బారిన పడి మరణించిన విషయం తెలిసిందే.
తగ్గుతున్నాయా?..
కరోనా కేసుల వివరాలను గత కొన్ని రోజులుగా పరిశీలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? అనేది అర్ధం కావటంలేదు. ఒక సారి తగ్గుముఖం పట్టాయనుకునేలోపే మళ్లీ భారీ స్థాయిలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అయితే ప్రారంభంలో ఉన్నంత కేసుల తీవ్రత ప్రస్తుతం మాత్రం లేదనే చెప్పాలి. తెలంగాణ వైద్యరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను గురువారం విడుదల చేసింది. కొత్తగా 1456 కేసలు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,27,580కి చేరింది. 2,06,105 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్‌కాగా 20,183 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జిహెచ్ఎంసిలో 254, రంగారెడ్డిలో 98, మల్కాజ్‌గిరిలో 98, భద్రాద్రి కొత్తగూడెంలో 82, ఖమ్మంలో 89 కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి.