కాసు మహేష్ రెడ్డి గురజాల ఎమ్మెల్యే అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలపై 85 దాడులు, 4 హత్యలు చేయించారని ఆయన ఆరోపించారు. అంకులు హత్య జరిగిన మూడు రోజులు గడచినా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని యరపతినేని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల అరాచకాలపై పోరాడుతునన టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన గుంటూరులో విమర్శించారు.
పోలీసులే హత్యలు చేయిస్తున్నారు
వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే హత్యలు చేయిస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్యపై పోలీసుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని గుర్తుచేశారు. నిందితులను అరెస్టు చేసినట్టు తెలిసినా, వారిని ఇంకా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. అంకులు హత్యలో పోలీసులపైనే విమర్శలు రావడంతో ఈ హత్యను దర్యాప్తు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాదే జమిలి ఎన్నికలు
టీడీపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని వచ్చే ఏడాదిలో జమిలి ఎన్నికలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ జమిలి ఎన్నికలకు ప్రధాని మోడీ వద్ద ఒప్పుకున్నారని యరపతినేని వెల్లడించారు. టీడీపీ శ్రేణులు కూడా జమిలి ఎన్నికలు సిద్దం కావాలని యరపతినేని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరిగే జమిలి ఎన్నికల్లో వైసీపీ నాయకులు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Must Read ;- అంకులు హత్య కేసులో ఆరుగురి అరెస్ట్











